Jr NTR: యంగ్ టైగర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

టాలీవుడ్ సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలు అమలైన తరువాత ఇంటికే పరిమితమైనప్పటికీ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. అల్లు అర్జున్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకోగా ఎన్టీఆర్ కు కరోనా సోకి నేటికి 12 రోజులైంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకుంటున్నారని అయితే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది.

మరో రెండు మూడు రోజుల్లో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో కోలుకోవడంతో పాటు నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వైద్యుల సలహాలను, సూచనలను ఎన్టీఆర్ పాటిస్తున్నారని త్వరలోనే ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పవచ్చని తెలుస్తోంది. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ నిన్న get well soon ntr నే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ఎన్టీఆర్ సూచనల మేరకు పుట్టినరోజు వేడుకలకు ఫ్యాన్స్ దూరంగా ఉన్నారు.

మరో రెండు రోజుల తర్వాత ఎన్టీఆర్ మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. ఎన్టీఆర్ కొత్త సినిమాల అప్ డేట్స్ విషయంలో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. సక్సెస్ లలో ఉన్న డైరెక్టర్లే ఎన్టీఆర్ తరువాత సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ రూల్స్ ను సడలిస్తే ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus