Jr NTR: రామరాజు పాత్రపై తారక్ కామెంట్స్ వైరల్!

సినిమాలలో పాత్రకు తగిన విధంగా ఒదిగిపోయి అద్భుతంగా నటించే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిజ జీవితంలో మాత్రం సరదాగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించే తారక్ హీరోగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 18వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు కర్ణాటకలో ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో బాహుబలి2 విడుదలైన తేదీనే రాజమౌళి ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

ఆర్ఆర్ఆర్ ఆ తేదీకే ఫిక్స్ అయితే ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ కావాల్సిన ఎఫ్3 మూవీ కూడా వాయిదా పడక తప్పదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ కొమురం భీమ్ రోల్ లో నటించారు. గోండు వీరుడి పాత్రలో తారక్ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ను చూసే సమయంలో రామరాజు రోల్ నిప్పుల మధ్య నుంచి దూకి బాణం సందించే సీన్ తనకు ఎంతగానో నచ్చిందని ఎన్టీఆర్ తెలిపారు.

ఆ సీన్ ఎంతలా నచ్చిందంటే ఆ పాత్రలో నేను నటించాలని అనిపించేతలా అని తారక్ కామెంట్లు చేశారు. ట్రైలర్ లో ఆ సీన్ వచ్చిన సందర్భంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల తనకు అలా అనిపించి ఉండవచ్చని ఎన్టీఆర్ అన్నారు. ఫిక్షనల్ కథగా ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కగా ఈ సినిమాకు సంబంధించి అభ్యంతరం తెలుపుతూ పలు పిటిషన్లు కోర్టులో దాఖలు అయ్యాయి. ఈ సినిమాలో హాలీవుడ్ నటులకు సైతం జక్కన్న ప్రాధాన్యత ఇచ్చారు.

550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా నిర్మాత దానయ్యకు ఈ సినిమా ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం. ఆర్ఆర్ఆర్ రిలీజైతే దానయ్యకు లాభాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. కొరటాల శివ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్కిప్ట్ పనులు పూర్తి చేయగా త్వరలో ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలుకానుంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus