యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే టెంపర్ (Temper) సినిమాకు ముందు టెంపర్ సినిమా తర్వాత అని మాట్లాడుకోవాలి. టెంపర్ సినిమాలో తారక్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అప్పట్లో దాదాపుగా 43 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమా మంచి లాభాలను అందించిందని నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) పలు సందర్భాల్లో వెల్లడించారు.
అయితే టెంపర్ సినిమాకు ముందు తారక్ నటించిన రామయ్యా వస్తావయ్యా (Ramayya Vasthavayya) , రభస (Rabhasa) సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రామయ్యా వస్తావయ్యా మూవీ సెకండాఫ్ లో పొరపాట్ల వల్ల ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోగా రభస మూవీ ఎన్టీఆర్ అభిమానులను ఏ మాత్రం మెప్పించలేదు. అయితే వరుసగా రెండు ఫ్లాపులు వచ్చిన సమయంలో ఒకింత రిస్కీ సబ్జెక్ట్ తో తారక్ టెంపర్ మూవీలో నటించారు. టెంపర్ మూవీ ఫస్టాఫ్ మరీ అద్భుతంగా లేకపోయినా సెకండాఫ్ లో సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో మూవీ హిట్టైంది.
అయితే ఈ సినిమాలో నటించడం వెనుక అసలు కారణాన్ని తారక్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. టెంపర్ సినిమా స్క్రిప్ట్ విన్న సమయంలో నాకు కనిపించింది ఒక మనిషి ప్రయాణం మాత్రమేనని మంచివాడు చెడ్డవాడుగా మారిపోతే చెడ్డవాడిగా మిగిలిపోతాడని చెడ్డవాడు మంచివాడిగా మారితే మాత్రం దేవుడిగా మిగిలిపోతాడని నేను నమ్మే సిద్ధాంతం కూడా ఇదేనని తారక్ (Jr NTR) తెలిపారు.
నా సిద్ధాంతానికి దగ్గరగా ఉండే సినిమా టెంపర్ అని నేను భావిస్తానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి తారక్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ షూట్ లో పాల్గొననున్నారు. మరోవైపు వార్2 షూట్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ లేవు. దేవర ప్రమోషన్స్ లో భాగంగా తారక్ (Jr NTR) కొత్త సినిమాల అప్ డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది.