Jr NTR: పదేళ్లలో ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్.. ఎన్టీఆర్ లా ఎవరూ చేయలేరుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. గత పదేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చారు. ఫ్లాప్ డైరెక్టర్లకు తారక్ నిజంగా లక్కీ హీరో అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్ల రేంజ్ ను తారక్ మార్చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

Jr NTR

టెంపర్ (Temper) తో పూరీ (Puri Jagannadh) , నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) సినిమాతో సుకుమార్ (Sukumar) , జై లవకుశ (Jai Lava kusha) సినిమాతో బాబీ (K. S. Ravindra) , అరవింద సమేత (Aravinda Sametha Veera Raghava) సినిమాతో త్రివిక్రమ్ (Trivikram) , దేవర సినిమాతో కొరటాల శివ (Koratala Siva) సక్సెస్ ను సొంతం చేసుకోగా తారక్ సినిమాను డైరెక్ట్ చేయడానికి ముందు ఈ డైరెక్టర్ల సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లా ఎవరూ చేయలేరని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తారక్ లాంటి స్టార్ హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో అవసరమని చెప్పవచ్చు. ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ అంటే నిర్మాతలు ఒకింత టెన్షన్ పడతారు. ఫ్లాప్ డైరెక్టర్లతో రిస్క్ అని తెలిసినా సినిమా చేయడం విషయంలో తారక్ ఒక విధంగా గ్రేట్ అయితే ఆ సినిమాలతో సక్సెస్ లను అందుకోవడం ద్వారా మరో విధంగా గ్రేట్ అని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకోవడం ప్లస్ అయింది. దేవర మూవీకి తారక్ రెమ్యునరేషన్ 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. దేవర సినిమా రెండు రోజుల్లో ఏకంగా 243 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఆదివారం కలెక్షన్లతో ఈ సినిమా సులువుగా 300 కోట్ల రూపాయల మార్కును క్రాస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

 ‘హరి హర వీరమల్లు’ కోసం మరోసారి గొంతు సవరించిన పవన్‌..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus