Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ కోసం మరోసారి గొంతు సవరించిన పవన్‌..!

సినిమా కోసం హీరోలు పాట పాడటం కొత్తేమీ కాదు. చాలామంది హీరోలు వాళ్ల కోసం, ఇతర హీరోల కోసం కూడా పాటలు పాడారు. అలాంటి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కూడా పాట పాడారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు సినిమాల కోసం పాడాడు. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్‌లోకి కొత్త సినిమా యాడ్‌ అయింది అని చెబుతున్నారు. ఆ కొత్త సినిమానే తాజాగా షూటింగ్‌ రీఓపెన్‌ చేసుకున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) . ఈ సినిమా కోసమే పవన్‌ గొంతు సవరించుకున్నాడట.

Pawan Kalyan

పవన్‌ కల్యాణ్‌లో గాయకుడూ ఉన్నారని మనకు తెలుసు. ‘తమ్ముడు’ (Thammudu) సినిమా నుండి ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) వరకు ఆయన చాలాసార్లు పాట పాడారు. బిట్‌ సాంగ్స్‌తో కలిపి ఆయన మొత్తంగా తొమ్మిదిపాటలు ఆలపించారు. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ సినిమా పాట పాడినట్టు తెలుస్తోంది. కీరవాణి (M. M. Keeravani) స్వరకల్పనలోని ఆ పాటని ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ ఆలపించడంతోపాటు, చిత్రీకరణ కూడా పూర్తి చేశారట. ఇక ఆ పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణ ఇటీవలే పునః ప్రారంభమైంది. విజయవాడలో కీలక పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. జ్యోతికృష్ణ (Jyothi Krishna)  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎమ్‌ రత్నం (AM Rathnam) సమర్పణలో ఎ.దయాకర్‌ రావు ఈ సినిమానునిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌  (Nidhhi Agerwal)  కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నర్గీస్‌ ఫక్రీ, బాబీ డియోల్‌ (Bobby Deol)  ఇతర కీలక పాత్రధారులు.

మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో తొలి పార్టు ‘స్వోర్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌ చేస్తామని టీమ్‌ ఇప్పటికే అనౌన్స్‌ చేసింది. అయితే ఇది అంతా అనుకున్నట్లుగా షూటింగ్‌ ముందుకెళ్తేనే అని తెలుసుకోవాలి. అది ఈ మధ్య కాలంలో జరగడం లేదు అని అంటున్నారు. మరి ఫ్యాన్స్‌ కోరిక ఈసారైనా నెరవేరుతుందా? అనేది చూడాలి.

నాగార్జున రివ్యూతో సత్యం సుందరం కలెక్షన్లు పెరుగుతాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus