Jr NTR , Kalyan Ram: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. ఏమైందంటే?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన తారకరత్న గుండెపోటుతో తీవ్ర అస్వస్థకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని తెలుస్తోంది. ఎక్మో సపోర్ట్ పై ప్రస్తుతం తారకరత్నకు చికిత్స అందిస్తున్నామని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. తారకరత్నను చూడటానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు చేరుకున్నారు.

బెంగళూరుకు వెళ్లిన తర్వాత తారక్, కళ్యాణ్ రామ్ నేరుగా ఆస్పత్రికి వెళ్లడం గమనార్హం. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తారకరత్న కుటుంబ సభ్యులతో పాటు వైద్యులను అడిగి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. మయోకార్డియల్ ఇన్ ఫార్క్ సన్ వల్ల తారకరత్న గుండెపోటుకు గురయ్యాడని తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వస్తున్న వార్తలు ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్లే కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఆస్పత్రికి చేరుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. గుండెపోటు వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించిందని మెలేనా అనే అరుదైన వ్యాధితో ఆయన బాధ పడుతున్నారని సమాచారం అందుతోంది. జీర్ణాశయాంతర రక్తస్రావానికి సంబంధించిన వ్యాధితో ఆయన బాధ పడుతున్నారని తెలుస్తోంది.

ఈ వ్యాధి బారిన పడిన వాళ్లలో గుండె వేగంగా కొట్టుకోవడం, శరీరం రంగు మారడం, చెమటలు పట్టడం, అలసట, ఇతర లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి బారిన పడిన వాళ్లకు వేర్వేరు చికిత్సలను అందించాల్సి ఉంటుంది. తారకరత్నకు సినిమాలలో ఆఫర్లు వస్తున్నా గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. బాలయ్య మాత్రం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారని తెలుస్తోంది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus