Jr NTR: ఎన్టీఆర్ అభిమానులకు ఇది శుభవార్తే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుండగా కొరటాల డైరెక్షన్ లో తారక్ హీరోగా తెరకెక్కే సినిమా కేవలం ఆరు నెలల్లోనే పూర్తి కానుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఫిబ్రవరి నెలలో ఈ సినిమాకు సంబంధించి రెండు అప్ డేట్స్ రానున్నాయని సమాచారం.

ఈ సినిమాలో నటించే హీరోయిన్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గురించి త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది దసరా టార్గెట్ గా షూట్ చేయనున్నారని తెలుస్తోంది. వీలైతే ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు సలార్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుంది. పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే ప్రశాంత్ నీల్ షూటింగ్ లను వేగంగా పూర్తి చేస్తారనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమాతో పాటు తారక్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని బోగట్టా. ఈ విధంగా రెండేళ్లలో నాలుగు సినిమాలు రిలీజయ్యేలా తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. తారక్ భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి. తారక్ నటిస్తున్న ఈ నాలుగు సినిమాల బడ్జెట్ 1,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటాలని ఈ హీరో అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్, బన్నీ బాలీవుడ్ లో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకోగా ఎన్టీఆర్, చరణ్ ఆ జాబితాలో త్వరలో చేరబోతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన తర్వాత 1,000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus