Jr NTR New Car: తారక్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని నెలల క్రితం లంబోర్ఘిని కారును ఇష్టపడి కొనుక్కున్న సంగతి తెలిసిందే. కేవలం జూనియర్ ఎన్టీఆర్ దగ్గర మాత్రమే భారత్ లో లంబోర్ఘిని ఉరస్ గ్రాఫిటే క్యాప్సుల్ మోడల్ కారు ఉంది. అతి త్వరలో ఈ కారు హైదరాబాద్ రోడ్లపై షికారు చేయనుండగా ఈ కారులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని సమాచారం. 3.16 కోట్ల రూపాయల విలువైన ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ కారు కావడం గమనార్హం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కారుకు సంబంధించిన ఫోటోలు తెగ చక్కర్లు కొడుతుండగా ఈ కారు 200 స్పీడ్ లో వెళ్లినా ఎలాంటి కుదుపులు ఉండవని తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు విదేశాల నుంచి కార్లను దిగుమతి చేసుకుని ట్యాక్స్ చెల్లించకుండా కోర్టు నుంచి మొట్టికాయలు తిన్నారు. సెలబ్రిటీ హోదాలో ఉండి కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ ట్యాక్స్ మినహాయింపులు కోరడంపై కోర్టు గతంలో పలువురు సెలబ్రిటీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే ఎన్టీఆర్ ట్యాక్స్ చెల్లిస్తారా..? లేక విదేశాల నుంచి కొనుగోలు చేసిన ఈ కారుకు పన్ను మినహాయింపు కోరతారా? తెలియాల్సి ఉంది. మూడు కోట్ల రూపాయల విలువ గల కారు కావడంతో ఈ కారుకు ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus