యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా గత మూడేళ్లలో రిలీజ్ కాలేదు. ఎన్టీఆర్ కొమురం భీమ్ రోల్ లో నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కావాల్సి ఉండగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. త్వరగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలని ప్రేక్షకులు కోరుకుంటుండగా ఆచార్య సినిమా విడుదలైతే మాత్రమే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.
అయితే తాజాగా తారక్ కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. కోర మీసంతో కిక్ ఇచ్చే డైనమిక్ లుక్ లో తారక్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ సూట్ లో స్టైలిష్ లుక్ తో జూనియర్ ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ఫోటోకు రికార్డు స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. క్లాసీ లుక్ లో ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ ఈ ఫోటోను చూసి మురిసిపోతున్నారు.
జనవరి 7వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏకంగా నాలుగుసార్లు రిలీజ్ డేట్లను మార్చుకుంది. కరోనా కేసులు తగ్గి 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు వచ్చిన తర్వాతే ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ ఎప్పుడు విడుదలైనా అంచనాలను మించి విజయం సాధిస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. రామ్ చరణ్ అభిమానులు సైతం ఆర్ఆర్ఆర్ విడుదలైతే బాలీవుడ్ లో చరణ్ కు మార్కెట్ పెరుగుతుందని అనుకుంటున్నారు.
ఎన్టీఆర్ మరో ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండటం గమనార్హం. ఎన్టీఅర్ భవిష్యత్ ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరకెక్కనున్నాయి.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!