ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరిగింది. తారక్ భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా విజయాలను సొంతం చేసుకుంటే తారక్ రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో బొద్దుగానే కనిపించిన తారక్ కొరటాల శివ సినిమా కోసం లుక్ ను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొరకు జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గుతున్నారు.
అయితే తారక్ న్యూ మేకోవర్ కు సంబంధించి మరో ఫోటో వైరల్ అవుతోంది. స్లిమ్ లుక్ లో గడ్డంతో జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ అనిపించుకుంటున్నారు. టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ లో తారక్ ఈ ఫోటోలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కొరటాల శివ సినిమా కోసం తారక్ తనను తాను మార్చుకుంటున్న తీరు ఫ్యాన్స్ ను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అభిమానులు సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ డెడికేషన్ కు అవాక్కవుతున్నారు.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొరటాల శివ ఇప్పటికే తారక్ సినిమా స్క్రిప్ట్ ను లాక్ చేశారు. కొత్త కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. రివేంజ్ కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కుతున్నా ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఆచార్య సినిమా ఫ్లాపైనా కొరటాల శివ సినిమా విషయంలో ఎన్టీఆర్ వెనక్కు తగ్గకపోవడం గురించి ఎన్టీఆర్, కొరటాల అభిమానులు తారక్ ను అభినందిస్తున్నారు.
భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఈ నెల 20వ తేదీన వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపికయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!