రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మార్చి 25న విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే రాజమౌళి గత చిత్రమైన ‘బాహుబలి2’ రికార్డులను కూడా తిరగరాసింది. అయితే మిగిలిన చోట్ల ఫుల్ రన్లో ఆ మూవీ కలెక్షన్లను అధిగమించడం కష్టమని తేలిపోయింది. ఇదిలా ఉండగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ రన్ టైం ఇప్పటికే 3 గంటలకి పైగా ఉంటుంది.
షూటింగ్లో భాగంగా చిత్రీకరించిన చాలా సన్నివేశాలను జక్కన్న డిలీట్ చేసాడట.లేదంటే రన్ టైం 4 గంటల వరకు వెళ్ళేదే. సీన్లు మాత్రమే కాదు.. ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా డిలీట్ చేసాడు అని వినికిడి. మరికొంత మంది అయితే రెండు పాటల్ని డిలీట్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. వీటిలో ఎంత వరకు నిజముందో తెలీదు కానీ ఒక పాటనైతే కచ్చితంగా డిలీట్ చేసారని తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్- ఒలీవియా మోరిస్ ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ఉందట.
ఈ పాట నిడివి 3 నిమిషాల పైనే ఉంటుందని తెలుస్తుంది.ఈ పాటని చివరి సమయంలో వద్దనుకున్నారని తెలుస్తుంది. ఈ పాటతో పాటు ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా డిలీట్ చేయడం జరిగిందట. ఇదిలా ఉంటే.. చరణ్- అలియా భట్ ల మధ్య కూడా ఓ రొమాంటిక్ సాంగ్ ఉండాలట. మరి ఈ పాట షూటింగ్ ను అయితే మొదలుపెట్టారు కానీ మధ్యలో ఆపేశారని వినికిడి. తగిన సందర్భం చూసుకుని ఎన్టీఆర్- ఒలీవియా మోరిస్ ల పాట అయితే యూట్యూబ్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!