గడిచిన ఆరేళ్లలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన అరవింద సమేత వీర రాఘవ (Aravinda Sametha Veera Raghava) , ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలు విడుదల కాగా తారక్ వేగంగా సినిమాలు చేయాలని పలు సందర్భాల్లో అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఫ్యాన్స్ ఆకాంక్షలకు అనుగుణంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అడుగులు వేస్తుండటం గమనార్హం. 15 నెలల్లో మూడు సినిమాలు విడుదలయ్యేలా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
పండుగల సమయంలో, ఏదో ఒక ప్రత్యేకత ఉన్న డేట్లలో మాత్రమే తన సినిమాలు రిలీజయ్యేలా తారక్ జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాల బిజినెస్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. దేవర (Devara) ఈ ఏడాది సెప్టెంబర్ నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సెప్టెంబర్ తొలి వారం నుంచి ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ జరగనున్నాయి. దేవర సినిమా ష్యూర్ షాట్ హిట్ అని తారక్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ సినిమా తర్వాత 2025 సంవత్సరం ఆగష్టు నెల 14వ తేదీన వార్2 మూవీ రిలీజ్ కానుంది. వార్2 సినిమాకు సంబంధించి ఇప్పటికే కీలక సన్నివేశాలను తారక్ పూర్తి చేశారని భోగట్టా. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నారని భోగట్టా. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ నీల్ కాంబో మూవీ 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన విడుదల కానుంది.
సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ప్లాన్ చేసుకున్న విధంగా విడుదలైతే ఈ సినిమాలు సరికొత్త రికార్ద్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత ఎన్టీఆర్ దేవర2 సినిమాతో బిజీ కానున్నారు. స్పెషల్ డేట్లకు ప్రాధాన్యత ఇస్తున్న తారక్ రాబోయే రోజుల్లో సంచలన రికార్డ్స్ ను ఖాతాలో వేసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.