Devara: ఇక్కడే కాదు అక్కడ కూడా దేవర గురించి చర్చ.. ఎన్టీఆర్ ప్లాన్ అదుర్స్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర (Devara) భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించాలంటే హిందీ కలెక్షన్లు కీలకమనే సంగతి తెలిసిందే. హిందీలో దేవరపై అంచనాలు పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న తరుణంలో తారక్ వార్2 సినిమా షూటింగ్ లో పాల్గొనడం వల్ల దేవర సినిమాకు ఎంతగానో ఎంతగానో కలిసొస్తుంది. ఇక్కడే కాదు బాలీవుడ్ లో సైతం దేవర గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. వార్2 సినిమా నుంచి తారక్ లుక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

దేవర రిలీజ్ కు ముందే ఎన్టీఆర్ వార్2 సినిమా షూటింగ్ లో పాల్గొనడం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ అదుర్స్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. దేవర గ్లింప్స్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా దేవర ఫస్ట్ సింగిల్ విడుదలవుతుందని ప్రచారం జరిగినా ఫస్ట్ సింగిల్ కు బదులుగా దేవర టీజర్ విడుదలైతే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

దేవర సినిమా నుంచి వరుస అప్ డేట్స్ వస్తున్నా ఈ సినిమా కథ గురించి క్లారిటీ మాత్రం రావడం లేదు. ఇప్పటికే చాలా ఏరియాలలో దేవర సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు ఎవరి సొంతమయ్యాయనే ప్రశ్నకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత డ్యూయల్ రోల్ పోషిస్తున్న దేవర కెరీర్ పరంగా తారక్ కు మరింత ప్లస్ అవుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకునే హిట్ ఈ సినిమాతో దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వరుస విజయాలతో తారక్ కెరీర్ పరంగా సక్సెస్ రేట్ ను పెంచుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus