తెలంగాణలో ఎన్నికలు ఇప్పటికే పూర్తి కాగా ఏపీలో ఎన్నికలు ఎప్పుడు పూర్తవుతాయనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే మాత్రమే ఏపీలో ఎన్నికలకు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్నికల తేదీకి ఒక వారం అటూఇటుగా సినిమాలను విడుదల చేసినా సినిమా కలెక్షన్లపై ఆ ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఏప్రిల్ నెలలో 5వ తేదీన దేవర రిలీజ్ కానుండగా మే నెల 9వ తేదీన కల్కి రిలీజ్ కానుంది.
ఐదు వారాల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానుండటంతో ఈ రెండు సినిమాల మధ్య రిలీజ్ కావడానికి చాలా సినిమాలు ఆసక్తి చూపడం లేదు. దేవర, కల్కి మధ్య రిలీజైతే చిన్న సినిమాలు, మిడిల్ రేంజ్ సినిమాలు కలెక్షన్ల విషయంలో తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది. దేవర సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా కల్కి 2898 ఏడీ 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు ప్రభాస్ (Prabhas)అభిమానులు ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. దేవర మూవీ సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా కల్కి 2898 ఏడీ కథకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ రెండు సినిమాలు వేర్వేరుగా కనీసం 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.