Jr NTR Remuneration: అన్నయ్య కోసం రెమ్యూనరేషన్ లేకుండా లేకుండా సినిమా చేస్తున్న తారక్!

అందరిలాగే నందమూరి వారసులు కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోలు గా కొనసాగుతున్నారు. నందమూరి తారక రామారావు తనయుడు బాలకృష్ణ ఇప్పటికీ తన సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. మరొకవైపు హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కళ్యాణ్ రామ్ హీరోగా సక్సెస్ అయినప్పటికీ ప్రొడ్యూసర్ గా మాత్రం ఫెయిల్ అయ్యాడు. హీరోగా అడపాదడపా సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

ఇప్పటికే తన బ్యానర్ లో పలు సినిమాలను నిర్మించిన కళ్యాణ్ చాలావరకు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా నిర్మించి కొంతమేర లాభాలను పొందాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యూచర్ కోసం తను నటించే సినిమాలను నిర్మించే అవకాశం కళ్యాణ్ రామ్ కి ఇచ్చాడు. అందువల్ల భవిష్యత్తులో ఎన్టీఆర్ నటించబోయే కొన్ని సినిమాలు కళ్యాణ్ రామ్ నిర్మించనున్నాడు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా మారనున్నాడు. ఎన్టీఆర్ సినిమాలకి కళ్యాణ్ రామ్ ఒక్కడే కాకపోయినా ఇతర బ్యానర్లతో కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ 31వ సినిమా పోస్టర్ వల్ల ఆ సినిమాకు కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాత అని తేలింది.

అందరి హీరోలలా కాకుండా ఎన్టీఆర్ తన అన్న బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారు.అందుకే ఈ రెండు సినిమాలకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తీసుకోకుండా తన అన్న కోసం ఉచితంగా సినిమాలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఎన్టీఆర్ సినిమాలు నిర్మించటం వల్ల కల్యాణ్ రామ్ ఆర్థికంగా నిలదొక్కుకుంటారో లేదో చూడాలి మరి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus