Jr NTR: ఆ సమయంలో ఆసాధ్యమైనది ఉండదన్న తారక్!

సాధారణంగా సినిమా రంగానికి చెందిన వాళ్లు నెటిజన్ల నుంచి ఏదో ఒక సందర్భంలో ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు సైతం ఏదో ఒక సందర్భంలో ట్రోల్స్ ను ఎదుర్కోక తప్పదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ కొమురం భీమ్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో థియేటర్లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో తారక్ చురుకుగా పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా తనదైన శైలిలో సినిమాకు సంబంధించిన ముచ్చట్లను చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ట్రైలర్ లో జూనియర్ ఎన్టీఆర్ బైక్ ఎత్తే సీన్ ఉండగా ఈ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ సీన్ విషయంలో ఎన్టీఆర్ ను ట్రోల్ చేశారు. బరువుగా ఉన్న బైక్ ను తారక్ సులువుగా ఎత్తడం ఎలా సాధ్యమైందని నెటిజన్లు కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో సైతం ఈ సీన్ గురించి చర్చ జరిగింది. అయితే తాజాగా ఒక రిపోర్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ట్రోల్స్ గురించి ప్రశ్నించగా ఆ సీన్ చేసే సమయంలో తాను కూడా రాజమౌళి దగ్గర అదే సందేహాన్ని వ్యక్తం చేశానని చెప్పుకొచ్చారు.

అత్యుత్సాహం, తీవ్రమైన ఆవేశం ఉన్న సమయంలో మనిషి ఏ పనినైనా సులభంగా చేయగలుగుతాడని ఆ సమయంలో అసాధ్యం అనేది ఉండదని ఈ సన్నివేశంలో అదే జరుగుతుందని తారక్ పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చూస్తే మాత్రమే సినిమాలో బైక్ ఎత్తడానికి గల కారణం తెలుస్తుందని తారక్ అన్నారు. 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదల కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని చెప్పవచ్చు.

500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది, చరణ్, ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ మూవీగా ఆర్‌ఆర్‌ఆర్‌ నిలిచే అవకాశాలు ఉన్నాయి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus