Jr NTR: హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్.. దేవర కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో బిజీ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాలో బాలీవుడ్ నటులతో పాటు కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రెటీలు కూడా ఇందులో నటిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే పలు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమా షూటింగ్ కు కాస్త విరామం రావడంతో గతవారం ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.ఇలా వారం రోజులపాటు వెకేషన్ లో ఎంజాయ్ చేసిన అనంతరం ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇలా హైదరాబాద్ చేరుకున్నటువంటి ఈయన త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

జూన్ 7వ తేదీ నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీంతో (Jr NTR) ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, నటి జాన్వీ కపూర్ కూడా భాగం కానున్నారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగును నవంబర్ నెలలో పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కొరటాల ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటిస్తున్నటువంటి వార్ 2 సినిమా షూటింగ్లో కూడా ఈయన బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ వరుస షూటింగ్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus