Jr NTR, Balakrishna: ఒక్క మాటతో అఖండ రివ్యూ ఇచ్చేసిన ఎన్టీఆర్!

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని మాస్ ఎలిమెంట్స్ తో బాలయ్యను మరొక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపించాడు. అందరికీ అఖండ సినిమా చాలా బాగా నచ్చినట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లో బాలయ్యను ఎలా చూపించాలో అలా ప్రజెంట్ చేశాడు అని అందరూ ప్రశంసలు కురిపించారు.ఇక స్టార్ హీరోలు కూడా అఖండ సినిమా సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రస్తుత సమయంలో ఇలాంటి ఓపెనింగ్స్ చాలా అవసరమని చెబుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా బాబాయ్ సినిమాపై ఒక్క మాటల్లోనే రివ్యూ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇప్పుడే అఖండ సినిమా చూశాను అంటూ.. బాల బాబాయ్ కి అలాగే మొత్తం చిత్ర యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్ తెలిపారు. ఇది రీసౌండింగ్ సక్సెస్ అంటూ పేర్కొన్న జూనియర్ ఎన్టీఆర్, ఎన్నో ఫ్యాన్ మూమెంట్స్ కూడా సినిమాల్లో ఉన్నాయి అని ప్రత్యేకంగా వివరణ ఇచ్చాడు.

దీంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సారి కూడా బాబాయి సినిమాను ప్రత్యేకంగా వీక్షిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా గతంలో జై బాలయ్య అంటూ ఎన్టీఆర్ చెప్పిన ఒక నినాదం వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus