Jr NTR: ఇబ్బంది పెట్టకండి… అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తారక్!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం అమిగోస్. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ 30 సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ అరిచారు ఈ క్రమంలోనే యాంకర్ సుమ కూడా ఎన్టీఆర్ తదుపరి సినిమా అప్డేట్ ఇవ్వాలని డైరెక్ట్ గా హీరోని ప్రశ్నించారు.

ఈ విధంగా ఎన్టీఆర్ తన సినిమా అప్డేట్ ఇవ్వాలని సుమ అనడంతో ఒక్కసారిగా తారక్ తన వైపు ఎంతో కోపంగా చూశారు. ఇలా తన చూపులతోనే సుమను కాస్త భయానికి గురి చేశారని చెప్పాలి. అనంతరం తన కోపాన్ని అనుచుకున్నటువంటి ఎన్టీఆర్ మైక్ చేతపట్టి వాళ్లు అడగకపోయినా మీరే చెప్పించేసేలా ఉన్నారు అంటూ సుమకు కౌంటర్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ 30గురించి అయినా ఏ హీరోల సినిమాల గురించి అయినా అప్డేట్ ఉంటే తప్పకుండా తాము అడగకముందే అప్డేట్ ఇస్తామని తెలిపారు.

ఇలా ప్రతి గంటకు ఒకసారి అప్డేట్ కావాలని దర్శక నిర్మాతలపై ఒత్తిడి తీసుకురావద్దు. మేము మా ఇంట్లో మనుషుల కన్నా అభిమానులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము ఏదైనా ఉంటే నా భార్య కన్నా ముందుగా మీకే తెలియచేస్తానని ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇలా ప్రతి గంటకు ఒకసారి సినిమాల గురించి అప్డేట్ ఇవ్వాలంటే కుదరని పని,

దయచేసి మమ్మల్ని అప్డేట్ అంటూ ఇబ్బంది పెట్టకండి అని అభిమానులకు తారక్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ అమిగోస్ ఈవెంట్లో అభిమానులను యాంకర్ సుమను ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus