Jr NTR: సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్న తారక్.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు (Jr NTR) ప్రేక్షకుల్లో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో క్రేజ్ ఉండగా చుట్టమల్లే సాంగ్ తో తారక్ ప్రేక్షకులను అంచనాలకు మించి ఆకట్టుకున్నారు. ఈ సాంగ్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం. చుట్టమల్లే సాంగ్ తెలుగు వెర్షన్ కు ఇప్పటివరకు 11 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అప్పట్లో నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) సినిమాతో తారక్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేయడం జరిగింది.

ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. చుట్టమల్లే సాంగ్ లో తారక్ ధరించిన షర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ ఈకామర్స్ సైట్లలో ఈ షర్ట్ ను కొనుగోలు చేయడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో చాలామంది ఆసక్తి చూపడంతో ఆ షర్ట్ సోల్డ్ ఔట్ అయిన పరిస్థితి నెలకొంది. అప్పుడూ ఇప్పుడూ తారక్ ట్రెండ్ ను సెట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంతో మెప్పిస్తున్నారు.

మరోవైపు దేవర (Devara)  సెకండ్ సింగిల్ చుట్టూ కొన్ని ట్రోల్స్ వస్తున్నా ఫ్యాన్స్ మాత్రం వాటిని పట్టించుకోకుండా సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దేవర సెకండ్ సింగిల్ ఇతర భాషల వెర్షన్లు సైతం ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. దేవర సీక్వెల్ షూట్ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతుండగా త్వరలో ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు దొరికే అవకాశం అయితే ఉంది.

కొరటాల శివ Koratala Siva) ఈసారి మాత్రం సక్సెస్ సాధించడం పక్కా అని అభిమానులు ఫీలవుతున్నారు. దేవర రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అప్ డేట్స్ రావాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus