Jr NTR: ఆ విషయంలో యంగ్ టైగర్ నిర్ణయం కరెక్టేనా?

  • December 23, 2022 / 07:08 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉండగా 2023 ఫస్టాఫ్ నుంచి ఈ స్టార్ హీరో రెగ్యులర్ షూటింగ్స్ తో బిజీ కానున్నారు. ప్రస్తుతం తారక్ వెకేషన్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో తారక్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు. అదే సమయంలో కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి తారక్ అస్సలు ఇష్టపడటం లేదు. కుటుంబానికి సంబంధించి ఎక్కువగా ప్రచారం జరగడం వల్ల నష్టమేనని తారక్ భావిస్తున్నారని తెలుస్తోంది.

కొన్నిరోజుల క్రితం తారక్ భార్యతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ ఫోటో కూడా ఫ్యాన్స్ తీసిన ఫోటో అని సమాచారం. మహేష్, బన్నీ, చరణ్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను రోజూ షేర్ చేసుకుంటుండగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ హీరోలకు భిన్నంగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన 2023 సంక్రాంతి కానుకగా రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

ఎన్టీఆర్30 ప్రకటన వెలువడితే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఈ సినిమా కోసం జాన్వీ 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఎన్టీఆర్ జాన్వీ జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జాన్వీ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus