NTR, Rajamouli: రాజమౌళికి దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్టీఆర్!

  • March 23, 2022 / 07:34 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి సన్నిహితులు అనే సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళికి దర్శకునిగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించగా రాజమౌళి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని వరుసగా హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. దర్శకధీరుడిగా జక్కన్నకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. రాజమౌళి ఛాన్స్ ఇస్తే అయన డైరెక్షన్ లో మళ్లీ నటించడానికి తారక్ ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తులో తారక్ జక్కన్న కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.

Click Here To Watch NEW Trailer

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో తారక్ కు దీవిలో మిమ్మల్ని పడేసి ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్లాలని చెబితే ఎవరిని తీసుకెళతారని ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు తారక్ తనదైన శైలిలో స్పందించారు. చరణ్ చాలా స్ట్రాంగ్ అని ముగ్గురు వ్యక్తులలో ఒకరిగా చరణ్ ను తీసుకెళతానని ఎన్టీఆర్ అన్నారు. చరణ్ అన్ని రకాలుగా బలవంతుడైన వ్యక్తి కావడంతో అతనిని తీసుకెళతానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

చరణ్ తో పాటు అక్కడికి రానాను కూడా తీసుకెళతానని తారక్ అన్నారు. నాకు వంట వచ్చు కాబట్టి అక్కడికి వంట మనిషి అవసరం లేదని తారక్ వెల్లడించారు. మూడో వ్యక్తిగా తాను అనిరుధ్ ను తీసుకెళతానని రాజమౌళిని తీసుకెళ్లనని తారక్ చెప్పుకొచ్చారు. అలాంటి చోట్ల జక్కన్నతో కష్టమని అందుకే ఆయనను వెంట తీసుకెళ్లాలని అనుకోవడం లేదని తారక్ వెల్లడించారు. అనిరుధ్ మ్యూజిక్ తో ఎంటర్టైన్ చేస్తాడు కాబట్టి ఆయనను తీసుకెళతానని తారక్ తెలిపారు.

తారక్ ఒక విధంగా జక్కన్నకు భారీ షాక్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు ఒక్కరోజు సమయం మాత్రమే ఉన్నా తారక్, చరణ్, రాజమౌళి ప్రమోషన్స్ విషయంలో తగ్గేదేలే అనే విధంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus