Jr NTR: ఎన్టీఆర్ కు చుక్కలు చూపించిన పెద్ద కొడుకు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అభయ్ చాలా సైలెంట్ అని భార్గవ్ రామ్ మాత్రం బాగా అల్లరి చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక వీడియో వైరల్ కాగా ఆ వీడియోలో అభయ్ రామ్ చేసిన అల్లరి అంతాఇంతా కాదు. సినిమాల్లో తారక్ విలన్లను చితకబాదతారనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినిమాల్లో ఒకే దెబ్బతో కండలు తిరిగిన మనుషులను కూడా మట్టికరిపిస్తారు.

సినిమాల్లో ఏ ఎమోషన్ ను అయినా ఎన్టీఆర్ అద్భుతంగా పండించగలరు. అయితే ఆన్ స్క్రీన్ లో ఇలా ఉండే ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం తన పిల్లలతో ఎంతో సరదాగా ఉంటారు. కొడుకు అభయ్ రామ్ తారక్ పై చేతితో పంచ్ లు వేస్తుంటే తారక్ మాత్రం కొడుకును ఒక్క మాట కూడా అనకుండా దెబ్బలు తిన్నారు. అభయ్ తన లేత చేతులతో కొడుతుంటే తండ్రిగా ఎన్టీఆర్ మధురానుభూతిని పొందుతున్నారు.

తండ్రిని సరదాగా పిడికిలి బిగించి ముఖంపై కొడుతూ అభయ్ ముసిముసి నవ్వులు నవ్వారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరోవైపు ఎన్టీఆర్ తన కొడుకులను బాల నటులుగా సినిమాల్లో నటింపజేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ కొడుకులు బాల నటులుగా ఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ పూర్తైతే కొరటాల శివ సినిమాతో ఎన్టీఆర్ బిజీ కానున్నారు.


విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus