సినీ రంగంలో అడుగు పెట్టినప్పటి నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర వేసాడు. నటన, అభినయం, డాన్స్ ఏ రంగం అయితేనేమి తనకు థానే సాటి అని నిరూపించేసుకున్నాడు. అందుకే తారక్ అభిమానులు ఎన్టీఆర్ అంటే అంతగా అభిమానిస్తారు. ప్రతీ సినిమాలో నూతనత్వం, అద్భుతమైన కథ, ప్రత్యేకమైన నటన ప్రతిభ ఎన్టీఆర్ సొంతం. ఇండస్ట్రీ హిట్స్ ఎన్నో ఎన్టీఆర్ ఖాతాలో చేరిపోవడానికి కారణం కూడా అదే. ఇక ఎన్టీఆర్ మూవీల్లోనే కాకుండా సాధారణంగా కూడా ఇరగదీస్తూ ఉంటాడు.
అప్పట్లో ఎన్టీఆర్.. టీడీపీ పార్టీ తరపున ప్రచారం చేసాడు ఆ ప్రచారంలో భాగంగా తన వాక్ చాతుర్యం, పదజాలంతో ప్రజలను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అది చూసి అందరు మరో నాయకుడు దిగి వచ్చాడని, సీనియర్ ఎన్టీఆర్ కు వారసుడు వచ్చాడని అనుకున్నారు. లీడర్షిప్ లక్షణాలు మెండుగా ఉన్నాయని అందరికీ తెలియజెప్పాడు ఎన్టీఆర్. ఇక తన మాటల పదునును ప్రతీ సినిమాలో చూపిస్తాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ విషయం ఎన్టీఆర్ మూవీల్లో డైలాగ్స్ చూస్తే అర్ధం అవుతుంది.
ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో మలయాళం కాకుండా మిగతా అన్ని భాషల్లో ఎన్టీఆర్ సొంతంగా డబ్బింగ్ చెప్పడం చాలా గొప్ప విషయమే. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో రిలీజ్ సందర్భంగా జపనీస్ భాషలో స్పీచ్ ఇచ్చాడు ఎన్టీఆర్. దీనితో అందరు ఆశ్చర్యపోయారు. తనకి జపనీస్ వచ్చేమో అనుకున్నారు అంతా. అది కాకుండా మరోసారి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఎన్టీఆర్. లాస్ ఏంజెల్స్ లో “ఆర్ఆర్ఆర్” సినిమా డీజీఏ థియేటర్లో స్ర్కీనింగ్ అయింది.
ఈ సందర్భంగా కార్యక్రమానికి రాజమౌళి, ఎన్టీఆర్ సహా మిగతావారు హాజరయ్యారు. ఈ వేదికపై తారక్ అమెరికన్ యాసలో అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడుతున్నంత సేపు స్వంత భాషలో మాట్లాడాడు. అలా భారతీయలు, పాశ్చాత్యులూ ఆశ్చర్యచకితులయ్యారు. ఎన్టీఆర్ ప్రతిభ మరోసారి ప్రూవ్ అయిందంటూ అభిమానులు ఈ విషయాన్ని కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!