ముంబైలో `ఆర్‌ఆర్‌ఆర్` ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు ఎన్టీఆర్,రాంచరణ్, మ్యూజిక్ డైరెక్టర్ యం.యం.కీరవాణి, హీరోయిన్లు అలియా భట్, శ్రియా వంటి వారు ఈ వేడుకలో పాల్గొన్నారు.వీరితో పాటు ‘ఆర్.ఆర్.ఆర్’ హిందీ వర్షెన్ ప్రజెంటర్ అయిన స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ వేడుకకి అక్కడి స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ముఖ్య అతిథిగా తీసుకొచ్చాడు. ఈ వేడుకకి ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోల ఎంట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
వీళ్ళని సింహాసనం పై నుండీ దింపి అభిమానులకు పూనకాలు తెప్పించాడు రాజమౌళి. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అసూయ పడేలా ఈ వేడుక అక్కడ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఒకానొక క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు హద్దులు మీరి రచ్చ చేశారు. బారికేడ్లు,గోడల పైకి ఎక్కుతూ బాగా ఎన్టీఆర్ పేరుతో గట్టిగా అరవడం మొదలుపెట్టారు.నిర్మాత కరణ్ జోహార్ కిందికి దిగమని వారిని రిక్వెస్ట్ చేసినా వినలేదు. దాంతో కరణ్ కాస్త అసహనానికి గురయ్యాడు.
‘ఎన్టీఆర్ అభిమానుల్ని ఎవ్వరూ ఆపలేరు’ అంటూ ఓ మాట వదిలేసాడు. దీనికి ఎన్టీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యి….”దయచేసి అందరూ క్రిందకి దిగాలి, క్రిందకి దిగి ఎంజాయ్ చెయ్యాలి, ఇది ఏమాత్రం పద్దతిగా లేదు.. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాము. మన గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవాలి” అంటూ గంభీరంగా వార్ణింగ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఇలా రియాక్ట్ అవ్వడంతో అతని ప్రశంసలు గురుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.
ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మూడున్నరేళ్ళుగా ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!