NTR, Buchibabu: కథలో మార్పులు కోరుతున్న యంగ్ టైగర్.. కానీ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది అని ‘ఉప్పెన’ టైం నుండి ప్రచారం జరుగుతుంది. కొరటాల శివ చిత్రం పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సినిమా ఉంటుందని భోగట్టా. అయితే మరోపక్క సోషల్ మీడియాలో ఎన్టీఆర్- బుచ్చిబాబు సినిమా ఉంటుందా? ఉండదా?  అనే అంశం పై చాలా డిస్కషన్లు జరుగుతున్నాయి.అన్నీ ఎలా ఉన్నా ఇటీవల ఎన్టీఆర్ బుచ్చిబాబు తో చేయబోయే సినిమా కథ విషయంలో…  ‘లవ్ ట్రాక్  రొటీన్ గా ఉందని, ఆ ట్రాక్ మొత్తం మార్చాలని’.. ఎన్టీఆర్ బుచ్చిబాబుకి సూచించినట్టు చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ చెప్పిన మార్పులు చేయడానికి బుచ్చిబాబు ఓకే చెప్పినట్టు డిస్కషన్లు జరుగుతున్నాయి.

అయితే అవన్నీ వట్టి ఊహాగానాలే అని తెలుస్తోంది.బుచ్చిబాబు ఎప్పుడో ఎన్టీఆర్ కు కథ చెప్పడం.. దానిని ఓకే చేయడం జరిగిపోయిందట.ఇప్పుడు ఎలాంటి మార్పులు కోరలేదు అని స్పష్టమవుతుంది. కొరటాల సినిమా ఫినిష్ అయిన వెంటనే బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ఆయన సన్నిహిత వర్గం నుండి అందుతున్న సమాచారం. ‘స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కానీ ఇంకా దాని పై క్లారిటీ రాలేదు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా టైంలో ఎన్టీఆర్- బుచ్చిబాబు ల మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ‘ఉప్పెన’ సినిమాలో బుచ్చిబాబు టేకింగ్.. ఎన్టీఆర్ కు విపరీతంగా నచ్చేయడంతో..  బుచ్చిబాబు తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఉత్సాహం చూపిస్తున్నారు అని స్పష్టమవుతుంది.

సుకుమార్ తో ఇప్పటికే పని చేసిన తారక్ సుకుమార్ శిష్యులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. మరోవైపు తారక్ కొరటాల శివ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఎన్టీఆర్ రేంజ్ ను కచ్చితంగా పెంచుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus