Jr NTR: ఫ్యాన్ ఫ్యామిలీ కోసం తారక్ చేసిన ఈ పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

సాధారణంగా అభిమానులు సంవత్సరాల తరబడి ఒకే హీరోకు అభిమానులుగా ఉంటారు. సినిమా హిట్టైనా ఫ్లాపైనా ఒకే హీరోను అభిమానించే వాళ్ల సంఖ్య కోట్లలో ఉంటుంది. అయితే ఒక అభిమానిని గుర్తు పెట్టుకుని ఆ అభిమాని కుటుంబానికి సంవత్సరాల తరబడి అండగా నిలిచే హీరోలు ఎంతమంది ఉంటారనే ప్రశ్నకు దాదాపుగా నో అనే సమాధానం వినిపిస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మాత్రం ఒక కుటుంబానికి 11 సంవత్సరాలుగా అండగా నిలిచారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హిట్ సినిమాలలో బాద్ షా (Baadshah) ఒకటి.

Jr NTR

ఈ సినిమాకు బండ్ల గణేష్ (Bandla Ganesh) నిర్మాతగా వ్యవహరించగా శ్రీనువైట్ల (Srinu Vaitla) దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందారు. ఆ సమయంలో బండ్ల గణేష్ రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. అయితే ఆ కుటుంబానికి తారక్ ఇప్పటికీ తన వంతు సహాయం చేస్తున్నారని భోగట్టా.

ఫ్యాన్ ఫ్యామిలీ కోసం తారక్ ఇప్పటికీ సపోర్ట్ గా నిలబడుతూ ఉండటం అంటే ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయం అనే సంగతి తెలిసిందే. ఆ కుటుంబానికి ఏ అవసరం ఉందని తన దృష్టికి వచ్చినా తారక్ వెంటనే రియాక్ట్ అవుతున్నారని సమాచారం అందుతోంది. ఈ విషయంలో తారక్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. ఎన్టీఆర్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని చెప్పవచ్చు.

మరో నెల రోజుల్లో దేవర (Devara) సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుకున్న తేదీకి చెప్పిన విధంగా సినిమాను రిలీజ్ చేయడం కోసం దేవర మేకర్స్ ఎంతో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది. దేవర1 ప్రమోషన్స్ లో తారక్ దేవర2 సినిమా గురించి క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

ట్రెడిషనల్ లుక్ లో అదుర్స్ అనిపించిన బాలయ్య.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus