కరోనా మహమ్మారి దేశం మొత్తాన్ని వణికిస్తోంది. సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలో కేసుల సంఖ్య బాగా పెరిగిపోయింది. వేళల్లో జనాలు మరణిస్తున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక సినిమా తారలు కూడా ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు సంబంధించిన చాలా మంది సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా రామ్ చరణ్, అల్లు అర్జున్, పూజాహెగ్డే లాంటి స్టార్లు ఈ వైరస్ బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అన్నారు. వైద్యుల సూచనల ప్రకారం.. తన కుటుంబంతో కలిసి హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు చెప్పారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని ఎన్టీఆర్ కోరారు.
ఈ ట్వీట్ చూసిన అభిమానులంతా తొందరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో పది రోజుల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి ఏమైనా అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తరుణంలో ఎన్టీఆర్ కోవిడ్ బారిన పడడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది.