RRR VFX: పులితో పోరాటం.. వీఎఫెక్స్‌ అద్భుతం ఎలా అంటే?

సినిమా అంటేనే మాయ, మిథ్య, లేనిది ఉన్నట్లు చూపించడం. అయితే ఈ క్రమంలో అందులో నటులు అయితే కనిపిస్తారు, నటస్తారు మాట్లాడతారు. అయితే లేని మనసుల్ని, జంతువుల్ని ఊహించుకుని నటించడమంటే చాలా కష్టం. ఇలా నటించినవాళ్లు తోపు ఆర్టిస్టులు అవుతారు. ఒకప్పుడు గ్రాఫిక్స్‌ వాడకం ఒకటో, రెండో సీన్స్‌లో గట్టిగా వాడేవారు. అయితే ఇప్పుడొస్తున్న సినిమాల్లో వీటి వాడకం బాగా పెరిగిపోయింది. రాజమౌళి సినిమాల్లో అయితే మరీనూ. తాజాగా ఆయన నుండి వచ్చిన ‘ఆర్‌ఆర్ఆర్‌’లో గ్రాఫిక్స్‌ ఎక్కడెక్కడ వాడారు అని లెక్కించుకోవడం మానేసి, ఎక్కడెక్క లేదు అని లెక్కేసుకోవడం మంచిది.

ఎందుకంటే సినిమాలో చాలా సన్నివేశాల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయి. సినిమా విడుదల తర్వాత వాటి వీఎఫెక్స్‌ బ్రేక్‌డౌన్‌ వీడియోలను చిత్రబృందం, ఆ వర్క్‌ చేసిన టీమ్స్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేస్తున్నాయి. తాజాగా సినిమా ప్రారంభంలో భీమ్ పాత్రను పరిచయం చేసిన పులిని ట్రాప్‌ చేసి, దాంతో పోరాటం చేసే సన్నివేశం బ్రేక్‌డౌన్‌ వీడియోను వీఎఫెక్స్‌ టీమ్‌ రిలీజ్‌ చేసింది. బ్లూ మాట్‌ తరహాలో చిత్రీకరించిన ఈ వీడియోలో పులికి బదులు ఆ స్థానంలో ఓ వ్యక్తి ఉంటాడు.

అతనినే పులి అనుకుని తారక్‌.. పోరాటం చేస్తుంటాడు. మన సీన్లో చూసినట్లుగా ఆ వ్యక్తి కదలడం, దానికి తగ్గట్టుగా తారక్‌ నటించడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. పులి లేకుండా అక్కడ పులి ఉన్నట్లుగా నటించడంలో తారక్‌ నటనలోని గొప్పతనం కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. లేని పులిని ఊహించుకుంటూ నటించడం సూపర్‌ కదా. ఇక ఈ సినిమా సంగతికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సుమారు రూ. 1200 కోట్లు వసూలు చేసింది.

ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చి వరల్డ్‌ సినిమా లవర్స్‌, సెలబ్రిటీలు, దర్శకులు, నటులతో శభాష్‌ అనిపించుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా బ్రేక్‌ డౌన్‌ వీడియోలు బయటికొచ్చాయి. అన్నీ వైరల్‌గా మారాయి. ఇప్పుడు ఈ వీడియో కూడా అదే కోవలోకి వచ్చి అద్భుతం అనిపించింది. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి మరి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus