Jr NTR: ఆ మూవీ కోసం భారీ రిస్క్ చేస్తున్న తారక్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవర నెక్స్ట్ లెవెల్ కథాంశంతో తెరకెక్కుతోందని ఇప్పటికే పలు వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్ తో పాటు అదిరిపోయే డైలాగ్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం తారక్ పడుతున్న కష్టం కూడా మామూలుగా లేదని సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండర్ వాటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని భోగట్టా.

ముంబై నుంచి ప్రత్యేకంగా ట్రైనర్లు వచ్చారని (Jr NTR) తారక్ కు ట్రైనింగ్ ఇస్తున్నారని తెలుస్తోంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో రెండు యాక్షన్ సీన్స్ ను అండర్ వాటర్ లో ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. డూప్ లేకుండా తారక్ ఈ సీన్ల షూట్ లో పాల్గొనున్నారని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొన్ని నెగిటివ్ సెంటిమెంట్లను బ్రేక్ చేసే మూవీ దేవర అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ కసితో ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. భరత్ అనే నేను సినిమా వరకు వరుస విజయాలను అందుకున్న కొరటాల శివ ఆచార్య సినిమా విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. దేవర విషయంలో మాత్రం కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన దేవర సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎక్కువ సంఖ్యలో పండుగలు ఉండటంతో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. 300 కోట్ల రూపాయల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవర సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus