Devara: బాబాయి ఫార్ములా పట్టుకుని తారక్‌కు హిట్‌ ఇద్దామనా కొరటాల

‘ఆచార్య’ సినిమా తర్వాత కొరటాల శివ ఏం చేసినా.. తారక్‌ అభిమానుల్లో చిన్న టెన్షన్‌ మొదలవుతోంది. ఆ సినిమాలో ఆయన చిరంజీవిని, కథను చూపించిన విధానం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో తారక్‌ను ఎలా చూపిస్తాడో అనే భయం ఏర్పడింది అందరికీ. అయితే ‘దేవర’ అంటూ ఎన్టీఆర్‌ నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో చూపించి అదరగొట్టారు. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త రావడంతో ఫ్యాన్స్‌ ఇంకా ఆనందంగా ఉన్నారు.

ఇప్పటికే విడుదలైన లుక్స్‌, మోషన్‌ పోస్టర్‌లో ఎన్టీఆర్‌ భయానికే భయం పుట్టించే ‘దేవర’గా కనిపించాడు. అయితే కేవలం ఇలా మాత్రమే కాకుండా.. మరో రకంగా కూడా కనిపిస్తాడు అని అంటున్నారు. అవును.. ఈ సినిమాలో తారక్‌ రెండు డిఫరెంట్‌ పాత్రల్లో నటిస్తున్నాడట. అయితే అది రెండు భిన్న పార్శ్వాలా లేక రెండు వేర్వేరు పాత్రలా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది అని కూడా అంటున్నారు.

ఈ సినిమా (Devara) సముద్రం, ఓ దీవి లాంటి ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ అయితే రాలేదు కానీ.. పోస్టర్లు, పాత్రల చిత్రణలు, లుక్‌లు చూస్తే చెప్పేయొచ్చు. మరి ఈ కొత్త పాత్ర / పార్శ్వం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఐదు భాషల్లో ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ భాషల్లో క్రేజ్‌ అండ్‌ రీచ్‌ పెంచడానికి ఆయా ఇండస్ట్రీల నటులను ఎంపిక చేసుకుంటున్నారు.

బాలీవుడ్‌ నుండి ఇప్పటికే హీరోయిన్‌, విలన్‌ను తీసుకొచ్చారు. కన్నడ నాట నుండి పొన్నప్ప అనే ‘కేజీయఫ్‌’ నటుడిని తీసుకున్నారు. ఇంకా త్వరలో మరికొంతమంది ఇతర భాషల నటులను ఎంపిక చేసుకుంటారని చెబుతున్నారు. అలా ప్రతి భాషలోనూ ఒక నటుడు ఉండేలా చూసుకుని… రిలీజ్‌ టైమ్‌కి హైప్‌ పెంచాలనేది ప్లాన్‌ అట. అయితే నేటివిటీ దెబ్బ తినకుండా చూసుకోవాల్సి ఉంటుంది అనేది అభిమానుల మాట.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus