Balayya Babu, Jr NTR: బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమాను తారక్ రీమేక్ చేస్తున్నారా.. ఏమైందంటే?

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల సినిమాలకు సంబంధించి వస్తున్న రూమర్లు ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఒకింత గందరగోళానికి నెడుతున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) భవిష్యత్తు సినిమాలకు సంబంధించి అలాంటి ఒక వార్త ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. బాలయ్య (Balakrishna) భైరవద్వీపం (Bhairava Dweepam) సినిమా తారక్ హీరోగా రీమేక్ కానుందని వైరల్ అవుతున్న వార్త సారాంశం. ఈ వార్తను విన్న తారక్ అభిమానులు వరుసగా సంచలన ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న తమ హీరో భైరవద్వీపం రీమేక్ లో నటించే ఛాన్స్ లేదని చెబుతున్నారు.

ఎవరో కావాలని ఈ తరహా ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. తారక్ తన సినీ కెరీర్ లో కేవలం ఒక సినిమాను మాత్రమే రీమేక్ చేశారని ఫ్యాన్స్ చెబుతున్నారు. భైరవద్వీపం రీమేక్ రూమర్ల గురించి భవిష్యత్తులో తారక్ సైతం క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. తారక్ దేవర సినిమాతో మరికొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.

ఇప్పటికే దేవర సినిమాపై అంచనాలు పెరగగా ఫస్ట్ సింగిల్ తో ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. అనిరుధ్ ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. సైఫ్ అలీ ఖాన్ గాయం నుంచి కోలుకోవడంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ఆవాంతరాలు ఉండబోవని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉండగా భారీ ప్రాజెక్ట్ లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus