Jr NTR, Prashanth Neel: నీల్‌ మామ… కొరటాలలా చేయొద్దు.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌… ఎందుకంటే?

అనుకున్న సమయానికి సినిమా స్టార్ట్‌ కాకపోతే ఈ మధ్య అభిమానులకు చాలా కోపం వచ్చేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా ఆ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు కూడా. స్టార్‌ హీరోల సినిమాలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ సమస్యను ఎదుర్కొన్న స్టార్‌ హీరోలు అంటే… ఎన్టీఆర్‌, మహేష్‌బాబు అనే చెప్పాలి. కొరటాల సినిమా ప్రారంభిస్తాం అని చెప్పిన సుమారు ఏడాది తర్వాత మొదలైందనే విషయం తెలిసిందే. దీంతో సినిమా స్టార్టింగ్‌ డేట్‌ అంటే ఫ్యాన్స్‌ ‘నిజమేనా’ అని భయపడుతున్నారు.

ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా? తాజాగా తారక్‌ మరో సినిమా స్టార్టింగ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. డేట్‌ అంటే డేట్‌ కాదు కానీ.. మంథ్‌ను అనౌన్స్‌ చేశారు. తారక్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ చెబుతూ రిలీజ్‌ చేసిన ఆ పోస్టర్‌లో సినిమా ప్రారంభించే డేట్‌ను చెప్పారు. అదే వచ్చే ఏడాది మార్చి. అవును మార్చి 2024లో సినిమా ప్రారంభిస్తాం అని చెప్పారు.

దీంతో ఫ్యాన్స్‌ ఓ వైపు ఆనందపడుతూనే మరోవైపు చెప్పిన డేట్‌కి మొదలుపెట్టేయాలి ‘నీల్‌’ అని అంటున్నారు. ఎందుకంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత తారక్‌కు ఏడాది గ్యాప్‌ వచ్చింది. ఇదిగో, అదిగో అంటూ కొరటాల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఆఖరికి ఇప్పుడు షూటింగ్‌ జరుగుతోంది. దాని వెనుక చాలా అంశాలు ఉన్నా.. ఆలస్యమైతే జరిగిపోయింది. దీంతో ప్రశాంత్‌ నీల్‌ ఇలాంటి సమస్యలు లేకుండా చూడాలని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు చాలా పుకార్లు వచ్చాయి. అయితే ఏ విషయంలో క్లారిటీ లేదు.

(Jr NTR) తారక్‌ లుక్‌ ఎలా ఉంటుంది అనేది క్లోజ్‌ షాట్‌లో ఓ పోస్టర్‌ ఇప్పటికే లాంచ్‌ చేశారు. దాని బట్టి చూస్తే.. ఈ సినిమాలో తారక్‌ చాలా రగ్‌డ్‌గా కనిపిస్తాడు. ఇక కథ ‘కేజీయఫ్‌’, ‘సలార్‌’ రేంజిలో ఉంటుంది అని చెప్పొచ్చు. ఇదంతా కొరటాల అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేస్తేనే అనే విషయం గుర్తుంచుకోవాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus