Jr NTR: తారక్ అభిమానులకు సర్ప్రైజ్.. ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?

  • February 15, 2023 / 01:21 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్ కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని సమాచారం. గతంలో తారక్ పలు సినిమాలలో తండ్రీ కొడుకుల పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా తారక్ తండ్రీ కొడుకుల రోల్స్ లో నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తారక్ అభిమానులకు సర్ప్రైజ్ లా ఈ రోల్ ఉంటుందని సమాచారం.

గతంలో తారక్ తండ్రీకొడుకుల పాత్రలలో నటించిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఈ సినిమా మాత్రం ఆ సెంటిమెంట్ ను కచ్చితంగా బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం అందుతోంది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని బోగట్టా. ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి త్వరగా క్లారిటీ వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో కొన్ని రొటీన్ అంశాలు ఉన్నా ప్రేక్షకుల ఊహలకు అందని సన్నివేశాలు ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నాయని సమాచారం అందుతోంది. పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. జాన్వీ కపూర్, మృణాల్ లలో ఎవరో ఒకరు ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్30 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుండగా యువసుధ ఆర్ట్స్ బ్యానర్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ను ఈ సినిమా పెంచనుందని తారక్ సినీ కెరీర్ లో స్పెషల్ మూవీగా ఈ సినిమా నిలవనుందని బోగట్టా.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus