Jr NTR, Trivikram: త్రివిక్రమ్ విషయంలో తారక్ అలా వ్యవహరించారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దాదాపుగా ఒకే సమయంలో సినీ కెరీర్ ను మొదలుపెట్టారు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ 2018 సంవత్సరం నవంబర్ 11వ తేదీన థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫుల్ రన్ లో 90 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

అరవింద సమేత వీర రాఘవ విడుదల కాకముందే తారక్ త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడినా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ సమయంలో తారక్ కు, త్రివిక్రమ్ కు మధ్య కొంతమేర గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీలో వినిపించింది. ఆ తర్వాత తారక్, త్రివిక్రమ్ ఒకే వేదికపై కనిపించకపోవడంతో వైరల్ అయిన వార్తలు నిజమేనని చాలామంది నమ్మారు.

అయితే నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాగా తారక్ ను త్రివిక్రమ్ కలిశారని త్రివిక్రమ్ శుభాకాంక్షలు తెలియజేయగా ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ ను సాదరంగా ఆహ్వానించడంతో పాటు కొంత సమయం మాట్లాడారని సమాచారం. ఈ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో మరో బ్లాక్ బస్టర్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ దగ్గర స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. తారక్ త్రివిక్రమ్ తమ కాంబినేషన్ లో మరో సినిమాకు సంబంధించి ఎప్పుడు శుభవార్త చెబుతారో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీ కానుండగా త్రివిక్రమ్ తర్వాత మూవీ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus