Jr NTR: ఎన్టీఆర్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య అన్ని లక్షలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ సక్సెస్ కెరీర్ పరంగా ప్లస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ వల్ల ఇతర దేశాల్లో కూడా తారక్ కు మంచి గుర్తింపు దక్కింది. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆర్ఆర్ఆర్ మూవీలో తారక్, చరణ్ నటనను ప్రశంసించారు. ఎమోషనల్ సీన్స్ తో తారక్ ఫ్యాన్స్ ను ఫిదా అయ్యేలా చేశారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ యాక్టివ్ గా ఉండకపోయినా తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

తాజాగా తారక్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్లకు చేరింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటే మాత్రం తారక్ అభిమానుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. 60 లక్షల ఫాలోవర్లు ఉండటం అంటే సాధారణ విషయం కాదనే సంగతి తెలిసిందే. అయితే తారక్ మాత్రం ట్విట్టర్ లో రాజమౌళిని తప్ప మరెవరినీ ఫాలో కారు. ఎంతోమంది దర్శకులు, సెలబ్రిటీలు ఉన్నా తారక్ మాత్రం రాజమౌళికి మాత్రమే ఆ గౌరవం ఇస్తుండటం గమనార్హం.

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. జులై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. కొరటాల శివ సినిమాతో మరో పాన్ ఇండియా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని తారక్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి తారక్ ప్రశాంత్ నీల్ సినిమాను మొదలుపెట్టనున్నారు. కొన్ని నెలల గ్యాప్ లోనే ఎన్టీఆర్ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

సినిమాసినిమాకు తారక్ కు క్రేజ్ పెరుగుతుండగా ఒక్కో సినిమాకు ఎన్టీఆర్ 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఎక్కువ మొత్తం డిమాండ్ చేసే ఛాన్స్ ఉన్నా తారక్ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో తారక్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus