Jr NTR, Koratala Siva: మరో రెండు నెలలు వాయిదా పడిన కొరటాల ఎన్టీఆర్ సినిమా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ నటించే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులలో ఆందోళన మొదలైంది. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి డైలాగ్ మోషన్ టీజర్ ను విడుదల చేశారు.ఇక ఇందులో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు చూసి ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన తగ్గింది. ఇక ఈ సినిమాని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని ఈ భారీ పాన్ ఇండియా మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.

ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను జరుపుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు కొరటాల శివ పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని తెలియడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.అయితే ఈ సినిమా ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా,మంచి ముహూర్తం పరంగా కొరటాల శివ తనకు మరో రెండు నెలల సమయం కావాలని ఎన్టీఆర్ ను అడగడంతో

ఈ సినిమా మరికాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.అదేవిధంగా ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు ఎన్టీఆర్ ను ఎంతో అసంతృప్తికి గురి చేశాయట.అందుకే క్లైమాక్స్ విషయంలో మార్పులు చేయాలని ఎన్టీఆర్ సూచించడంతో కొరటాల స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా హిట్ తో మంచి ఊపు మీద ఉన్న ఎన్టీఆర్ వెంటనే ఈ సినిమాను ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus