Jr NTR: ఆ డైరెక్టర్ కు తారక్ ఓకే చెప్పారా?

  • June 18, 2022 / 11:03 PM IST

యంగ్ టైగర్ జునియర్ ఎన్టీఆఅర్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం నాలుగేళ్ల సమయం కేటాయించి ఆ కష్టానికి తగ్గ ఫలితం సాధించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ వేగంగా సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతారని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. తారక్ తర్వాత ప్రాజెక్ట్ లకు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకులుగా ఫిక్స్ కాగా ఎన్టీఆర్32 ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే పలువురు డైరెక్టర్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మొదట బుచ్చిబాబు పేరు వినిపించగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటన రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చింది.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్32 ప్రాజెక్ట్ కు వెట్రి మారన్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో వెట్రి మారన్ కు దర్శకునిగా ఊహించని స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్నాయి. వెట్రి మారన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. సాధారణ కథలతో అసాధారణ విజయాలను సొంతం చేసుకుంటూ ఈ దర్శకుడు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

ఈ దర్శకుడు ఇప్పటికే తారక్ కు కథ చెప్పారని ఇంటెన్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ కాంబో మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్టీఆర్ ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లను పూర్తి చేసేవరకు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది.

ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఆకాశమే హద్దుగా తారక్ క్రేజ్ పెరిగింది. జులై లేదా ఆగష్టు నుంచి ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus