Jr NTR: ఎన్టీఆర్ కు ప్రభాస్ హీరోయిన్ కూడా నొ చెప్పిందట..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఇది. అందులోనూ పాన్ ఇండియా మూవీగా మలచాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు. అందుకే పాన్ ఇండియా కళ కనిపించేలా ముందుగా అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఒక్క రోజు ముందు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఆచార్య’ తో ప్లాప్ మొహం చూసొచ్చిన కొరటాల ఈ చిత్రంతో పెద్ద హిట్టు కొట్టేలానే ఉన్నాడు.

ఇదిలా ఉండగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడింది. దానిని నిలబెట్టుకోవాలి అంటే కచ్చితంగా కొరటాల మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ఉండాలి. అప్పుడే బాలీవుడ్ జనాలకి ఈ మూవీ విశేషాలు వంటివి త్వరగా రీచ్ అవుతున్నాయి. అక్కడ బిజినెస్ కూడా బాగా జరగాలి అంటే కచ్చితంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యుండాలి. అందుకే అలియా భట్, కైరా అద్వానీ వంటి భామల్ని సంప్రదించారు దర్శకనిర్మాతలు కానీ వాళ్ళు నొ చెప్పారు.

రష్మిక ని కూడా సంప్రదించారు. ఆమె ఓకే చెప్పింది. సో ఆమెను అలా హోల్డ్ లో పెట్టి ఇంకా అక్కడి స్టార్ హీరోయిన్లను సంప్రదిస్తూనే ఉన్నారు. అలా దీపికా పడుకోణెని ఎంపిక చేసుకున్నారు. కానీ అందుకు ఆమె నొ చెప్పిందనేది తాజా సమాచారం. కొరటాల ‘ఆచార్య’ తో పాటు ఎన్టీఆర్ ప్రాజెక్టుకి కూడా హీరోయిన్ సెట్ చేయడం కోసం తిప్పలు పడుతూనే ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ 30 ప్రాజెక్టుని యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మిస్తుండగా కళ్యాణ్ రామ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus