Jr NTR: తారక్ భీమ్ లుక్ వెనుక ఇంత కష్టం ఉందా?

రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఏ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో రామరాజు పాత్రలో రామ్ చరణ్ భీమ్ పాత్రలో తారక్ తాము తప్ప ఆ పాత్రలలో మరెవరూ నటించలేరనేంత అద్భుతంగా నటించి మెప్పించడం గమనార్హం. అయితే కొమురం భీమ్ లుక్ కోసం తారక్ ఏకంగా 18 నెలలు కష్టపడ్డారని బోగట్టా.

కొమురం భీమ్ పాత్ర కోసం తారక్ బరువు పెరిగారు. తారక్ కు ఫిట్ నెస్ ట్రైనర్ గా పని చేసిన లాయిడ్ స్టీవెన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడి లుక్ ను మార్చుకోవడం వల్లే ఆ పాత్రకు అనుగుణంగా కనిపించగలిగారు. సినిమాలోని చాలా సన్నివేశాలలో తారక్ తన కళ్లతో పలికించిన అద్భుతమైన ఎక్స్ ప్రెషన్లు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తారక్ సినీ కెరీర్ లోని మరపురాని సినిమాలలో ఆర్.ఆర్.ఆర్ ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పాత్రకు అనుగుణంగా లుక్ ను మార్చుకోవడానికి తారక్ చాలా ప్రాధాన్యతనిస్తారు. ఆర్.ఆర్.ఆర్ కోసం బరువు పెరిగిన తారక్ కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గుతున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే బరువు తగ్గిన తారక్ స్టైలిష్ లుక్ లో ఫ్యాన్స్ ను ఫిదా చేసేలా కనిపించనున్నారని తెలుస్తోంది. తారక్ కొరటాల శివ కాంబో మూవీ 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

తారక్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ను తీసుకుంటున్నారని తెలుస్తోంది. కొరటాల శివ తన సినీ కెరీర్ లో బెస్ట్ మూవీగా ఈ సినిమా నిలిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కొరటాల శివ తారక్ కాంబో మూవీకి సమంత పేరును పరిశీలించరని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని బోగట్టా.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus