యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన బృందావనం మూవీ 2010 సంవత్సరంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం బృందావనం సినిమాను ఎంతగానో ఇష్టపడతారు. ఈ సినిమా కథ రొటీన్ గానే ఉన్నా కథనం మాత్రం కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయి. అయితే బృందావనం సినిమా జపాన్ లో మార్చి నెల 15వ తేదీన విడుదలవుతోంది.
జపనీస్ సబ్ టైటిల్స్ తో అక్కడ ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఈ సినిమా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు. బృందావనం సినిమా ఇప్పటికే ఐదు భాషల్లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు.
బృందావనం పోస్టర్లతో జపాన్ లోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేస్తుండగా అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్స్ కూడా ఈ సినిమాలో అదుర్స్ అనేలా ఉంటాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సైతం బృందావనం రీరిలీజ్ కావాలని కామెంట్లు చేస్తున్నారు. బృందావనం రీరిలీజ్ దిశగా దిల్ రాజు అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ విషయానికి వస్తే తారక్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జులై నెల చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. వార్2 సినిమాను పూర్తి చేసిన తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.
భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!