Devara Vs NBK 109: ఏపీ పాలిటిక్స్‌లో కుదర్లేదు.. ఇప్పుడు దసరాకు ప్లాన్‌ చేశారా? నిజమేనా?

ఆంధ్రప్రదశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాలకృష్ణ (Nandamuri Balakrishna)  వర్సెస్‌ ఎన్టీఆర్‌ (Jr NTR)  ఉంటుంది అని కొంతమంది ఊహించారు. రాజకీయంగా ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారే అయినా.. వివిధ కారణాల వల్ల ఎన్టీఆర్‌ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే మొన్నీమధ్య జరిగిన ఎన్నికల్లో తారక్‌ ఏదో ఒక సైడ్‌ తీసుకొని ఓ పార్టీకి సపోర్టు చేస్తారేమో అని అనుకున్నారు కొందరు. కానీ ఆయన చాలా క్లీన్‌గా ఎవరి గురించీ మాట్లాడకుండా కామ్‌గా ఉన్నారు. ఇప్పుడు అక్కడ కుదరని క్లాష్‌ దసరాకు బాక్సాఫీసు దగ్గర ఉంటుందా.

ఏమో టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఈ విజయదశమికి బాలకృష్ణ సినిమా, తారక్‌ పిక్చర్‌ ఢీకొంటాయి అని ఓ అంచనా వేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ – బాబీ కొల్లి (K. S. Ravindra) కాంబినేషన్‌లో NBK 109 వర్కింగ్ టైటిల్‌తో ఓ సిని మా షూటింగ్ జరుపుకుంటుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ దసరాకు సినిమాను రిలీజ్‌ చేయాలని చూస్తున్నారని లేటెస్ట్ టాక్‌. ఆ లెక్కన అక్టోబర్ 10నే రిలీజ్ చేస్తారని అంటున్నారు.

ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘దేవర 1’ (Devara)  సినిమా కూడా అదే సమయానికి రిలీజ్‌ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్‌ ఇప్పుడు జరగడం లేదు. ‘వార్‌ 2’ షూటింగ్‌ షెడ్యూల్‌ త్వరలో ముగిశాక తారక్‌ ‘దేవర’ పనులు చేస్తాడని అంటున్నారు. ఆ లెక్కన దసరాకు ఈ సినిమా రెడీ అవుతుంది అని చెబుతున్నారు. దీంతో దసరా బాబాయ్‌ – అబ్బాయి క్లాష్‌ తప్పదు అని లెక్కలేస్తున్నారు.

ఒకవేళ ఇదే జరిగితే టాలీవుడ్‌ బాక్సాఫీసు దగ్గర సంభవించే అతి పెద్ద క్లాష్‌లలో ఇదొకటి అని చెప్పొచ్చు. గతంలో ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒకే రోజున లేదంటే ఒకే సీజన్‌లో రావడం కొత్తేం కాదు. కానీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు ఒకే సీజన్‌లో రావడం అరుదు. అది జరిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus