దేవర (Devara) సినిమా విడుదలై వారాలు గడుస్తున్నా కలెక్షన్స్ జోరు తగ్గలేదు. మొత్తానికి రాజమౌళి మిత్ ని బ్రేక్ చేస్తూ RRR తరువాత జూనియర్ ఎన్టీఆర్ కు మరో కమర్షియల్ హిట్ దక్కింది, ఇక టాలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది. మొదట్లో నెగిటివ్ టాక్, విమర్శలు రెండింటినీ ఎదుర్కొన్నా, దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద తన స్థాయిని నిలబెట్టుకుంది. దసరా సెలవుల్లో భారీగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా ప్రోత్సాహం అందింది.
మద్యమధ్యలో వసూళ్లలో చిన్న మార్పులు వచ్చినా, పోటీగా ఇతర సినిమాలు కూడా లేకపోవడంతో దేవర సినిమాకు కలిసొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ చిత్రం భారీ రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా బాహుబలి 1 రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. ఈ విజయంతో ఎన్టీఆర్ కూడా 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించే అవకాశం ఇచ్చింది.
ఇదిలా ఉంటే, అభిమానులు ఇప్పుడు దేవర ఓటీటీలో విడుదల తేదీపై ఆసక్తిగా ఉన్నారు. డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు భారీ ధరకు అమ్ముడవగా, ఈ నెల చివరి వారంలో స్ట్రీమింగ్ కావచ్చని టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదు. అనుకున్న ప్లాన్ ప్రకారం నవంబర్ 8న స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది.
సినిమా సీక్వెల్‌పై కూడా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే రెండో భాగానికి కొంత షూటింగ్ పూర్తి చేసినట్టు చెప్పాడు. ఎన్టీఆర్ కూడా సినిమాను తక్కువ గ్యాప్‌లోనే ప్రారంభించాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం వార్ 2 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఆ సినిమా పూర్తయ్యాక దేవర 2కు సంబంధించిన పనులను వేగవంతం చేయనున్నాడు.