Devara: అలాంటి టాక్ రావాలంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  దేవర (Devara)  సినిమా రిలీజ్ కు సరిగ్గా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. దావూదీ సాంగ్ తెలుగు వెర్షన్ కు ఇప్పటివరకు 21 మిలియన్ల వ్యూస్ రాగా రాబోయే రోజుల్లో ఈ సాంగ్ 50 మిలియన్ల మార్క్ ను అందుకుంటుందేమో చూడాలి. చుట్టమల్లె సాంగ్ కు మాత్రం ఏకంగా ఇప్పటివరకు 103 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ ఇప్పటికీ టాప్5 లో ట్రెండింగ్ లో నిలవడం కొసమెరుపు.

Devara

అయితే దేవర (Devara) సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా రిలీజైన రెండు వారాలకే వేట్టయాన్  (Vettaiyan), విశ్వం (Viswam) సినిమాలు రిలీజ్ కానున్నాయి. దేవర టాక్ ను బట్టి దసరా పండుగ కానుకగా మరికొన్ని సినిమాలు సైతం రిలీజ్ కానున్నాయి. అయితే దేవరకు దసరా పండుగ సమయంలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఉండాలంటే మాత్రం అదిరిపోయే టాక్ రావాలి.

కొన్ని చిన్న సినిమాలు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు దేవర (Devara) టాక్ ను బట్టి తమ సినిమాలను ప్లాన్ చేసుకోనున్నాయని సమాచారం అందుతోంది. మరోవైపు దేవర ప్రీమియర్స్ ప్రదర్శితం అయ్యే థియేటర్లు ఇవేనంటూ కొన్ని థియేటర్ల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దేవర ప్రమోషన్స్ ను త్వరగా మొదలుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా దేవర (Devara) నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దేవర సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం అందుతోంది. తారక్ దేవర సినిమాతో కళ్యాణ్ రామ్  (Nandamuri Kalyan Ram)  కు భారీ లాభాలు రావాలని ఫీలవుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను నిలబెట్టాల్సిన బాధ్యత సైతం తారక్ పై ఉందని చెప్పవచ్చు.

వారి అభిప్రాయాలు మనకెందుకు.. పట్టించుకోవద్దు: అదా శర్మ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus