టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ప్రత్యేకమనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రతిభ ఉన్న నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రజంట్ జనరేషన్ లో పౌరాణిక పాత్రల్లో సైతం నటించి మెప్పించగల నటుడిగా ఎన్టీఆర్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డ్యాన్సర్ అనే విషయం మనందరికీ తెలిసిందే. బాల్యంలోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న తారక్ క్లాసికల్ డ్యాన్సర్ గా పలు స్టేజ్ షోలు ఇచ్చారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది.
చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే అమితమైన ఆసక్తి ఉన్న ఎన్టీఆర్ ఆ వీడియోలో అద్భుతంగా డ్యాన్స్ చేయడంతో ఎన్టీఆర్ లో క్లాసికల్ డ్యాన్సర్ గా ఇంత టాలెంట్ ఉందా..? అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు మాత్రం ఎన్టీఆర్ క్లాసికల్ డ్యాన్స్ కథాంశంతో కూడిన కథలో నటిస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. మరి అభిమానుల సూచనలను స్వీకరించి ఎన్టీఆర్ అలాంటి కథలో నటించడానికి ఓకే చెబుతారేమో చూడాల్సి ఉంది.
వైరల్ అవుతున్న వీడియోను చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. చిన్న వయస్సులోనే ఎన్టీఆర్ తల్లి షాలిని అతనికి నృత్యంలో శిక్షణ ఇప్పించారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చెప్పిన డేట్ కే రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!