అక్కడ జులాయి సినిమా అట్టర్ ప్లాప్

  • February 27, 2016 / 11:25 AM IST

తెలుగు లో  మాటల మాంత్రికుడు, త్రివిక్రమ్  శ్రీనివాస్ ను ఒక రేంజ్ లో నిలబెట్టిన సినిమా ‘జులాయి’. అలాగే  బన్నీ కి స్టార్ డం తీసుకొచ్చిన సినిమా అని చెప్పొచు.కాని తమిళ్ రీమేక్ లో మాత్రం ఈ సినిమా బారీ ప్లాప్ గ మిగిలిపోయింది. ‘సాహసం’ అనే టైటిల్  పెట్టి, విడుదల చేసి ఈ సినిమా ఎప్పుడొచ్చి  వెళ్లిందో కూడా తెలియలేదు.తమిళ్ హీరో ప్రశాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంట్రీ ని ఈ సినిమా తో ఘనంగా ప్రారంభించాలనుకున్నాడు.ఎన్నో వాయిదాల తరువాత ఈ నెల 5 న విడుదలైన ఈ చిత్రం భారీ  డిజాస్టర్‌ గా మిగిలిపోయింది.

‘సాహసం’ తో తన సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోవాలి అనుకున్న ప్రశాంత్ కి దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది.ఇందులో హీరోయిన్ గా నిక్కి గిర్లాని నటించింది.తమిళ ప్రేక్షకులు ప్రశాంత్ ని ఎప్పుడో మర్చిపోవడం కూడా ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి ఒక కారణం.ఇక పోతే మన ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ హిట్స్ ఐన సినిమాలను రీమేక్ చేసి తమిళ్ లో ప్లాప్ చెయ్యడం వాళ్ళకు కొత్తేం కాదు.’సింహాద్రి’, ‘నువ్వునాకు నచ్చావ్’ లాంటి భారీ హిట్ సినిమాలు తమిళ్ లో ఘోరంగా విఫలమైనాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus