టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభ గల నటుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ఎన్టీఆర్ ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలలో సైతం ఎన్టీఆర్ కు వీరాభిమానులు ఉన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఇతర హీరోలకు షాక్ ఇస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నంబర్ 1 స్థానంలో నిలిచారు. గడిచిన వారం రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోలకు సంబంధించి ట్విట్టర్ లో ఎన్టీఆర్ మొదటి స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.
సాధారణంగా ఫ్యాన్స్, ఇతరులు ఏవైనా అప్ డేట్స్ ఇచ్చే సమయంలో సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్లు మెన్షన్ చేస్తారనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు ఏకంగా ఒక మిలియన్ మెన్షన్స్ రావడం గమనార్హం. ఎన్టీఆర్ తరువాత స్థానంలో మహేష్ బాబు ఉండగా ఆయనకు 5,60,000 మెన్షన్స్ వచ్చాయి. ఎన్టీఆర్, మహేష్ తరువాత స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉండగా ఆయనకు 5,55,000 మెన్షన్స్ లభించాయి. 4,20,000 మెన్షన్స్ తో పవన్ కళ్యాణ్ తరువాత స్థానంలో ఉండగా రామ్ చరణ్ కు 2,90,000 మెన్షన్స్ లభించాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ కేవలం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఒక సినిమాలో నటించాల్సి ఉన్నా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉండగా లాక్ డౌన్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఇంటికే పరిమితమయ్యారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!