Jyothika: సూర్య సినిమాలో హీరోయిన్స్.. జ్యోతిక చెబితేనే…!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) సినిమాల వెనుక అన్‌సీన్ ఫోర్స్‌గా అతని భార్య జ్యోతిక (Jyothika) ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ జోరుగా వినిపిస్తోంది. ఒకప్పుడు సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన జ్యోతిక, పెళ్లి తర్వాత కొన్నేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. ప్రస్తుతం తిరిగి తెరపై కనిపిస్తున్నారు. అలాగే ఆమె సూర్య సినిమాలపై నాణ్యమైన సూచనలు, ఆలోచనలతో తన సపోర్ట్‌ను కొనసాగిస్తున్నారు. ఇటీవల సూర్య నటించిన కంగువ (Kanguva) సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయమై జ్యోతిక కీలక పాత్ర పోషించారట.

Jyothika

పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో దిశా పటానిని (Disha Patani) హీరోయిన్‌గా తీసుకోవాలని ఆమె రిఫర్ చేశారని సమాచారం. బడా మార్కెట్ కోసం గ్లామర్ అండ్ క్రేజ్ కలిసే ఫేస్ అవసరమన్న ఉద్దేశంతో దిశాను ఎంపిక చేసినట్లు టాక్. అయితే ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే సూర్య, జ్యోతిక కలిసి ప్రారంభించిన 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందిన రెట్రో (Retro)  సినిమాకు కూడా జ్యోతిక కొన్ని సజెషన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇందులో స్పెషల్ సాంగ్ కోసం శ్రీయను (Shriya Saran) ఎంపిక చేయడంలో ఆమె సూచన ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ సాంగ్ వింటేజ్ లుక్‌తో బాగానే కనెక్ట్ అవుతుందని టాక్. హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde)  డీ గ్లామర్ లుక్ లో కనిపించగా, శ్రీయ మాత్రం పూర్తి స్టైల్‌లో అలరించనున్నారు. ఇంతకన్నా స్పెషల్ విషయమేమిటంటే, ఈ స్పెషల్ సాంగ్‌ను తమిళ్‌లో సూర్యే స్వయంగా ఆలపించారట. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ (Santhosh Narayanan) వెల్లడించిన ఈ సమాచారం ఇప్పుడు ఆ పాటపై హైప్ పెంచింది.

సూర్య వింటేజ్ మాస్ స్టైల్, కార్తీక్ సుబ్బరాజ్  (Karthik Subbaraj)  మార్క్ టేకింగ్, పూజా-శ్రీయ పాత్రలు.. అన్నీ కలిపి రెట్రోపై అంచనాలను పెంచాయి. మొత్తానికి సూర్య సినిమాల్లో హీరోయిన్ల ఎంపికపై జ్యోతిక ఇన్‌పుట్ కీలకంగా మారిందనడానికి ఈ రెండు సినిమాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు హీరోలతో స్క్రీన్ పంచుకున్న జ్యోతిక, ఇప్పుడు హీరోయిన్స్ ఎంపిక చేస్తుండటం ఆసక్తికరమే. మరి ఈ ఎంపికలు విజయం తీసుకురావటంలో ఎంత వరకు సహాయపడతాయో చూడాలి.

ప్రభాస్ సినిమా కోసం 700 కోట్లా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus