Raghavendra Rao: రాఘవేంద్రరావు ప్రేమలేఖ రేటెక్కువే..!

  • May 25, 2022 / 03:27 PM IST

‘నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ’ అంటూ తన సినీ జీవిత ప్రయాణాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు దర్శకేంద్రుడు. రాఘవేంద్రరావు 80వ పుట్టినరోజు సందర్భంగా ఈ పుస్తకానికి సంబంధించిన విశేషాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. 40 ఏళ్ల అనుభవాలు కాబట్టి పెద్ద పుస్తకమే ఉంటుంది అని అనుకున్నారు అభిమానులు. అనుకున్నట్లుగా పుస్తకం చాలా పెద్దదే. అయితే పుస్తకమే కాదు ధర కూడా పెద్దదే అంటున్నారు. అవును, రాఘవేంద్రరావు ప్రేమలేఖ ఖరీదు సుమారు రూ. మూడు వేలు అట. దీనిపై ఇంకా క్లారిటీ లేదు కానీ టాలీవుడ్‌ వర్గాల్లో అయితే ఇదే మాట వినిపిస్తోంది.

మూడు వేల రూపాయలు చెల్లించుకుంటేనే పుస్తకం కొనొచ్చు అనేది టాక్‌. మామూలుగా పుస్తకాని భారీ ధర అంటే ఏ వెయ్యి రూపాయలో అనుకుంటాం. కానీ మూడు వేల రూపాయలు అంటే కొనేవాళ్లు కాస్త ఆలోచిస్తారనే చెప్పాలి. మరి అంత రేటు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది తెలియాల్సి ఉంది. ఆ పుస్తకంలో నేను నడిచిన సినిమా దారిలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లతో పాటు , రచయితలతో పాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను.

అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ (నా) ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతున్నాను. నా ఈ స్థితికి కారణమైన 24 శాఖలవారికి అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి, నేను నేర్చుకున్న పాఠాల గురించి చెబుతున్నా అంటూ తన బుక్‌ గురించి చెప్పుకొచ్చారు కె.రాఘవేంద్రరావు. అంతేకాదు ‘‘నేను చెప్పేదొక్కటే సినిమా అనేది ఇలానే ఉండాలి అనే గీత గీయకూడదుజ ఇలా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు నిరూపించాయి.

ఈ పుస్తకం ప్రతి పుస్తకాలయాల్లో దొరుకుతుంది. పాఠలకులందరూ పుస్తకాన్ని చదివి ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని చెప్పారు కె.రాఘవేంద్రరావు. మరి ఆయన పుస్తకంలో ఇంకేం చెప్పారో చూడాలి. ఎందుకంటే 40 ఏళ్ల అనుభవం అందులో ఉంటుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus