కిరణ్ అబ్బవరం గత దీపావళికి ‘క’ అనే సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా అతని మార్కెట్ ను పెంచింది. దీంతో దీపావళిని సెంటిమెంట్ గా ఫీలయ్యి.. ఈసారి `K-RAMP` ని దింపుతున్నాడు. జెయిన్స్ నాని దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాని రాజేష్ దండా నిర్మించారు. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల కానుంది. టైటిల్ చూస్తుంటే బూతులా అనిపిస్తున్నా.. అది బూతు కాదు అంటూ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు మేకర్స్.
పైగా ఇది ‘ఫ్యామిలీ ప్యాక్’ మూవీ అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. టీజర్.. ట్రైలర్స్ లో బూతులు విచ్చల విడిగా ఉన్నాయి. లిప్ లాక్..లు వంటి వాటి గురించి చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే.. `K-RAMP` సినిమాని టీం ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు మేకర్స్ చూపించడం జరిగింది. సినిమా చూశాక వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
వారి టాక్ ప్రకారం.. `K-RAMP`సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు ఉంటుందట. బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టినప్పటికీ చిల్లరగా తిరిగే హీరో, తల్లి లేని పిల్లాడు అని భావించి అతన్ని గారాబంగా పెంచే తండ్రి.. కాలేజీలో అనుకోకుండా హీరోకి తగిలే హీరోయిన్.. ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ.. ఆ తర్వాత హీరోయిన్ కి ఉన్న సమస్య కారణంగా ఇబ్బంది పడే హీరో.. ఇదే సినిమా మెయిన్ పాయింట్ అని తెలుస్తుంది.
సినిమాలో సిట్యుయేషన్ కామెడీ ఉంటుందట. క్లైమాక్స్ బాగా వచ్చిందని.. సినిమాపై ఉన్న ఒపీనియన్ ని అది మార్చేస్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అక్టోబర్ 18 వరకు వేచి చూడాల్సిందే.